శ్రీ హయగ్రీవ స్తోత్రం

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే | 1

స్వత: సిద్ధం శుద్ధ స్ఫటికమణి భూభ్రుత్ ప్రతిభటం
సుధాసధ్రీచీభిర్ద్యుతిభిరవదాత త్రిభువనం
అనంతై: త్రయ్యంతైరనువిహిత హేషాహలహలం
హతాశేషావద్యం హయవదనమీడీమహి మహ: | 2

సమాహార: సామ్నాం ప్రతిపదమృచాం ధామ యజుషాం
లయ: ప్రత్యూహానాం లహరి వితతిర్బోధ జలధే:
కథా దర్ప క్షుభ్యత్ కథక కుల కోలాహల భవం
హరత్వంతర్ధ్వాంతం హయవదన హేషా హలహల: | 3


ప్రాచీ సంధ్యా కాచిదంతర్నిశాయా:
ప్రజ్ఞాదృష్టేరంజనశ్రీరపూర్వా
వక్త్రీ వేదాన్ భాతు మే వాజి వక్త్రా
వాగీశాఖ్యా వాసుదేవస్య మూర్తి: | 4

విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం
విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షం
దయానిధిం దేహ భృతాం శరణ్యం
దేవం హయగ్రీవమహం ప్రపద్యే | 5

అపౌరుషేయైరపి వాక్ ప్రపంచై:
అద్యాపి తే భూతిమదృష్ట పారాం
స్తువన్నహం ముగ్ధ ఇతి త్వయైవ
కారుణ్యతో నాథ కటాక్షనీయ: | 6

దాక్షిణ్య రమ్యా గిరిశస్య మూర్తి:
దేవీ సరోజాసన ధర్మపత్నీ
వ్యాసాదయోపి వ్యపదేశ్య వాచ:
స్ఫురంతి సర్వే తవ శక్తి లేశై: | 7

మందోభవిష్యన్ నియతం విరించో
వాచాం నిధే వంచిత భాగధేయ:
దైత్యాపనీతాన్ దయయైవ భూయోపి
అధ్యాపయిష్యో నిగమాన్ చేత్ త్వం | 8

వితర్క డోలాం వ్యవధూయ సత్త్వే
బృహస్పతిం వర్తయసే యతస్త్వం
తేనైవ దేవ త్రిదశేశ్వరాణాం
అస్పృష్ట డోలాయితమాధిరాజ్యం | 9

అగ్నౌ సమిద్ధార్చిషి సప్తతంతో:
ఆతస్థివాన్ మంత్రమయం శరీరం
అఖండ సారై: హవిషాం ప్రదానై:
ఆప్యాయనం వ్యోమ సదాం విధత్సే | 10

యన్మూలమీదృక్ ప్రతిభాతి తత్త్వం
యా మూలమామ్నాయ మహా ద్రుమాణాం
తత్త్వేన జానంతి విశుద్ధ సత్త్వా:
త్వామక్షరామక్షర మాతృకాం త్వాం | 11

అవ్యాకృతాద్ వ్యాకృత వానసి త్వం
నామాని రూపాణి యాని పూర్వం
శంసంతి తేషాం చరమాం ప్రతిష్ఠాం
వాగీశ్వర త్వాం త్వదుపజ్ఞ వాచ: | 12

ముగ్ధేందు నిష్యంద విలోభనీయాం
మూర్తిం తవానంద సుధా ప్రసూతిం
విపశ్చితశ్చేతసి భావయంతే
వేలాముదారామివ దుగ్ధ సింధో: | 13

మనోగతం పశ్యతి : సదా త్వాం
మనీషిణాం మానస రాజహంసం
స్వయం పురోభావ వివాద భాజ:
కింకుర్వతే తస్య గిరో యథార్హం | 14

అపి క్షణార్ధం కలయంతి యే త్వాం
ఆప్లావయంతం విశదైర్మయూఖై:
వాచాం ప్రవాహైరనివారితైస్తే
మందాకినీం మందయితుం క్షమంతే | 15

స్వామిన్ భవద్ధ్యాన సుధాభిషేకాత్
వహంతి ధన్యా: పులకానుబంధం
అలక్షితే క్వాపి నిరూఢమూలం
అంగేష్వివానందథుం అంకురంతం | 16

స్వామిన్ ప్రతీచా హృదయేన ధన్యా:
త్వద్ధ్యాన చంద్రోదయ వర్ధమానం
అమాంతమానంద పయోధిమంత:
పయోభిరక్ష్ణాం పరివాహయంతి | 17

స్వైరానుభావా: త్వదధీన భావా:
సమృద్ధ వీర్యా: త్వదనుగ్రహేణ
విపశ్చితో నాథ తరంతి మాయాం
వైహారికీం మోహన పింఛికాం తే | 18

ప్రాఙ్నిర్మితానాం తపసాం విపాకా:
ప్రత్యగ్ర ని:శ్రేయస సంపదో మే
సమేధిషీరంస్తవ పాద పద్మే
సంకల్ప చింతామణయ: ప్రణామా: | 19

విలుప్త మూర్ధన్య లిపి క్రమాణాం
సురేంద్ర చూడాపద లాలితానాం
త్వదంఘ్రి రాజీవ రజ:కణానాం
భూయాన్ ప్రసాదో మయి నాథ భూయాత్ | 20

పరిస్ఫురన్నూపుర చిత్రభాను
ప్రకాశ నిర్ధూత తమోనుషంగాం
పదద్వయీం తే పరిచిన్మహేంత:
ప్రబోధ రాజీవ విభాత సంధ్యాం | 21

త్వత్కింకరాలంకరణోచితానాం
త్వయైవ కల్పాంతర పాలితానాం
మంజుప్రణాదం మణినూపురం తే
మంజూషికాం వేదగిరాం ప్రతీమ: | 22

సంచింతయామి ప్రతిభా దశాస్థాన్
సంధుక్షయంతం సమయ ప్రదీపాన్
విజ్ఞాన కల్పద్రుమ పల్లవాభం
వ్యాఖ్యాన ముద్రా మధురం కరం తే | 23

చిత్తే కరోమి స్ఫురితాక్షమాలం
సవ్యేతరం నాథ కరం త్వదీయం
జ్ఞానామృతోదంచన లంపటానాం
లీలాఘటీ యంత్రమివాశ్రితానాం | 24

ప్రబోధ సింధోరరుణై: ప్రకాశై:
ప్రవాళ సంఘాతమివోద్వహంతం
విభావయే దేవ సపుస్తకం తే
వామం కరం దక్షిణమాశ్రితానాం | 25

తమాంసి భిత్వా విశదైర్మయూఖై:
సంప్రీణయంతం విదుషశ్చకోరాన్
నిశామయే త్వాం నవపుండరీకే
శరద్ఘనే చంద్రమివ స్ఫురంతం | 26

దిశంతు మే దేవ సదా త్వదీయా:
దయాతరంగానుచరా: కటాక్షా:
శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం
సరస్వతీం సంశ్రిత కామధేనుం | 27

విశేషవిత్పారిషదేషు నాథ
విదగ్ధ గోష్టీ సమరాంగణేషు
జిగీషతో మే కవితార్కికేంద్రాన్
జిహ్వాగ్ర సింహాసనమభ్యుపేయా: | 28

త్వాం చింతయన్ త్వన్మయతాం ప్రపన్న:
త్వాముద్గృణన్ శబ్దమయేన ధామ్నా
స్వామిన్ సమాజేషు సమేధిషీయ
స్వచ్ఛంద వాదాహవ బద్ధశూర: | 29

నానావిధానామగతి: కలానాం
చాపి తీర్థేషు కృతావతార:
ధృవం తవానాథ పరిగ్రహాయా:
నవం నవం పాత్రమహం దయాయా: | 30

అకంపనీయాన్యపనీతి భేదై:
అలంకృషీరన్ హృదయం మదీయం
శంకాకళంకాపగమోజ్జ్వలాని
తత్త్వాని సమ్యంచి తవ ప్రసాదాత్ | 31

వ్యాఖ్యా ముద్రాం కరసరసిజై: పుస్తకం శంఖచక్రే
బిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణ:
అమ్లానశ్రీరమృత విశదైరంశుభి: ప్లావయన్ మాం
ఆవిర్భూయాదనఘ మహిమా మానసే వాగధీశ: | 32

వాగర్థ సిద్ధిహేతో: పఠత హయగ్రీవ సంస్తుతిం భక్త్యా
కవితార్కిక కేసరిణా వేంకటనాథేన విరచితామేతాం | 33